మోహన్ లాల్ వృషభ ట్రైలర్ రిలీజ్..

మోహన్ లాల్ వృషభ ట్రైలర్ రిలీజ్..

మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్‌‌గా  నంద కిషోర్ రూపొందించిన చిత్రం   ‘వృషభ’.  ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌తో క‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్   నిర్మించింది. డిసెంబర్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా  సినిమా విడుదల కానుంది.  గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా తెలుగు ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. 

 బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీగా పేరు తెచ్చుకుని వ్యాపార రంగంలో ఖ్యాతి సంపాదిస్తాడు ఆదిదేవ వర్మ (మోహన్ లాల్).  కెరీర్‌‌‌‌లో తిరుగులేని ఆదిదేవ వర్మ మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అతనికి తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి. ఆ జ్ఞాపకాల్లో రాజా విజయేంద్ర వృషభ (మోహన్ లాల్) అసమాన యోధుడిగా తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు.

 ఈ నేపథ్యంలో ఆయన  కొడుకు (సమర్జీత్ లంకేష్) సైకియాట్రిస్టులతో సంప్రదింపులు చేస్తూ, తండ్రిని కాపాడుకుంటూ ఉంటాడు.  గతాన్ని,  వర్తమానాన్ని కలుపుతూ   ఆసక్తిరేపేలా సాగిన  ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.